బాబుకు మరో కుంపటి: కడియం తీవ్ర వ్యాఖ్యలు

దాదాపు ఎనిమిది నెలల తర్వాత శుక్రవారం తెలుగుదేశం తెలంగాణ ఫోరం సమావేశం జరిగింది. చుట్టూ చేరి చెవులు కొరికే వారికి చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని కడియం శ్రీహరి సమావేశంలో వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పార్టీని వీడి తిరిగి వచ్చినవారికి పదవుల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ ఫోరం అనేది పనిచేస్తుందా, అది ఉందా అని శాసనసభ్యుడు మహేందర్ రెడ్డి అడిగినట్లు చెబుతున్నారు. తెలంగాణపై ఒక్క అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా తమ పరిస్థితి ఉందని కడియం శ్రీహరి అన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ నేతలం పది మందిమి ఒక్కచోట చేరి మాట్లాడుకోలేకపోతున్నామని ఆయన అన్నారట.
మొత్తం మీద, మరోసారి తెలంగాణ తెలుగుదేశం నేతల్లో అసంతృప్తి జ్వాలలు రగులుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. కడియం శ్రీహరి తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తూనే ఉన్నారు. కానీ, పార్టీ నుంచి బయటకు వచ్చే ఆలోచన చేయడం లేదు. పార్టీకి నిబద్డుడిగా వ్యవహరిస్తున్నారు.












Click it and Unblock the Notifications