నాన్న బయోగ్రఫీ: కెసిఆర్ తనయ కవిత కొత్త జాబ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కూతురు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏ విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. ఆమెకు వచ్చే ఆలోచనలో ఆచరణలో పెట్టడంలో ఆమె చాలా ముందుంటారు. ఇప్పుడు ఆమెకు ఓ కొత్త ఆలోచన వచ్చింది. దాంతో ఆమె కొత్త ధర్మాన్ని నిర్వర్తించబోతున్నారు. తన తండ్రి కెసిఆర్ జీవిత చరిత్రను రాయడం ఆ కొత్త ఉద్యోగం.
అకుంఠిత దీక్ష, క్రమశిక్షణతో కూడిన రాజకీయ నాయకుడిగా ఎదగడం వల్లనే కెసిఆర్ నాయకత్వ లక్షణాలు ఒంటబ ట్టించుకున్నారని కల్వకుంట్ల కవిత అన్నారు. మా నా న్నకు నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా వున్నాయని అభిప్రాయాన్ని ఆమె వ్యక్తం చేశారు. ఈ లక్షణాలే తెలంగాణ సాధనలో ఆయన కీలకభెైమిక పోషించడానికి ప్రధానమై న కారణమయ్యాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

శుక్రవారం ఆమె హైదారబాద్‌లో మీడియాతో మాట్లాడారు. మరుగున పడిన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను వెలుగులోకి తెచ్చేందుకు కేసీఆర్ కూతురిగా తెలంగాణ జాగృతి అనే సంస్థను ఏర్పా టు చేసి తెలంగాణ ప్రజలకు తన వంతు సహకారాన్ని అందిస్తున్నానని చెప్పారు.
తమ నాన్నకున్న లక్షణాలను ఆధారంగా చేసుకొని ఆయన వ్యక్తిత్వంపెై ఒక పుస్తకాన్ని రాస్తానని ఈ సందర్భంగా చెప్పారు. ఆయన బయోగ్రఫీని ప్రధాన అంశంగా ఈ పుస్తకాన్ని రూపొందిస్తానని కవిత వివరించారు. పదమూడేళ్ళ తెలంగాణ ఉద్యమంలోని అనుభవాలు, అందులో వెలుగురాకిరాని విషయాలను ఇందులో ప్రధానంగా పొందుపరుస్తానని చెప్పారు. ఎటువంటి పరిస్థితిలోనెైనా మా నాన్న ఒకేలా వుంటాడని ఆమె వివరించారు.












Click it and Unblock the Notifications