'హీరో కాదు జీరో: చిన్ననాటి నుండి కిరణ్ తొండి'

Kiran Kumar Reddy always looser: Vivek
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చిన్నప్పటి నుండి ఓడిపోవడం అలవాటేనని, ఆయన ఎప్పుడు తొండి ఆట ఆడతారని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ శనివారం ఎద్దేవా చేశారు. కిరణ్ తెలంగాణ వ్యతిరేక వ్యాఖ్యల పైన వివేక్ ధ్వజమెత్తారు. కిరణ్‌ను తాను చిన్నప్పటి నుంచి చూస్తున్నానని, తాము ఒకే పాఠశాలలో చదువుకున్నామని, అన్నీ తెలిసినట్టే ప్రవర్తించినా ఆయనకు ఏమీ తెలియదన్నారు.

కనీస అవగాహన కూడా ఉండదని విమర్శించారు. ఒఖ నిర్ణయం పైన ఎప్పుడు నిలబడరన్నారు. చిన్నప్పటి నుంచి అతను అంతేనన్నారు. ఒకసారి తనతో టేబుల్ టెన్నిస్‌లో ఓడిపోయాడని, అతడు లూజర్ అని ఎద్దేవా చేశారు. అన్నింటా ఓడిపోయే రకమేనని, ఆయన సీమాంధ్ర లీడర్ కావాలని అనుకుంటున్నా కాలేడన్నారు.

పాఠశాల జీవితం నుంచి అతనిది తొండి ఆటేనన్నారు. ఇప్పుడు హీరో అనుకుంటున్నాడు కానీ, ఓడిపోయి జీరో కావడం ఖాయమన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టినట్లు ఆయనకు తెలుసునని, కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా పాటిస్తానని చెప్పిన కిరణ్ నిర్ణయం వచ్చాక తొండి మాటలు మాట్లాడుతున్నారన్నారు.

చిన్నప్పుడు పాఠశాలల్లో ఎప్పుడు ఆటల్లో గెలవని కిరణ్ తొండి ఆట ఆడేవారని, ఇప్పుడు కూడా అలాగే తొండి మాటలు మాట్లాడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కిరణ్ తెలంగాణ, సీమాంధ్ర ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+