తెలంగాణ వ్యతిరేకత: జగ్గారెడ్డి వెనక కిరణ్ రెడ్డి?

ఓ అడుగు ముందుకు వేసి తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడం లేదని, అభివృద్ధిని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలా అంటూ ఇలా మాట్లాడాలని తనకు ఎవరూ చెప్పలేదని ఓ ముక్తాయింపు ఇచ్చారు. అలా అనడంలోనే అసలు విషయం ఏమిటో తెలిసిపోతుందని తెలంగాణవాదులు అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాటలనే జగ్గా రెడ్డి తన నోట పలుకుతున్నారని అంటున్నారు.
నిజానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేయడానికి పుట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరి, మొదటి సారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రోద్బలంతో కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇప్పుడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరిస్తున్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణను అభివృద్ధి చేస్తున్నారని ఆయన వకాల్తా పుచ్చుకుంటున్నారు. ఇటీవలి కాలం దాకా తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును, ఆ పార్టీ శాసనసభ్యులు కెటి రామారావు, హరీష్ రావును నోరారా తిడుతూ వచ్చిన ఆయన ఇప్పుడు ఏకంగా తెలంగాణ రాష్ట్రమే అవసరం లేదనే వాదనను ముందుకు తెచ్చారు. అయితే, జగ్గారెడ్డి తప్ప అటువంటి ఓ సమూహం వైయస్ రాజశేఖర రెడ్డికి మాదిరిగా కిరణ్ కుమార్ రెడ్డికి తయారైన సూచనలు కనిపించడం లేదు.












Click it and Unblock the Notifications