వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంకుర్ సినిమా: వారికి బూస్ట్ ఇచ్చిన కిరణ్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
సమస్యల పరిష్కారం తర్వాతే విభజనపై ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుండబద్దలు కొట్టి చెప్పడం సీమాంధ్ర ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు, మంత్రులకు ఓ బూస్ట్ లాగా పని చేసిందని చెప్పవచ్చు. కిరణ్ తర్వాత ఆయన దారిలో పలువురు నడుస్తున్నారు. విభజన విషయంలో తాను, కిరణ్ ఒకటేనని పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ చెప్పగా.. విభజనపై గత కొద్దిరోజులుగా పెదవి విప్పని కేంద్రమంత్రి కావూరి సాంబశివ రావు కూడా విభజనతో విచ్ఛిన్నమేనని పెదవి విప్పారు. అంకుర్ సినిమా పరిస్థితి వస్తుందేమోనని రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.

కిరణ్ ప్రశ్నల పరంపరపై సీమాంధ్ర మంత్రులు, నేతల నుండి ప్రశంసలు వస్తున్నాయి. అందరూ ఆయనను ప్రశంసల్లో ముంచెత్తారు. కొందరు మీడియా సమావేశాల్లో, జిల్లాల్లో జరుగుతున్న ఆందోళనల్లో కిరణ్ వాదనను సమర్థించారు. బొత్స సత్యనారాయణ, మంత్రులు గంటా శ్రీనివాస రావు, విశ్వరూప్ శనివారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. విభజన వల్ల కలిగే అనర్థాల గురించి బాగా వివరించారంటూ సిఎంను అభినందించారు.

సిఎల్పీ కార్యాలయంలో శనివారం మంత్రులు కోండ్రు మురళీ, బాలరాజు, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కేవలం ముఖ్యమంత్రి పదవి కోసమే కిరణ్‌ను విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి, పిసిసి మాజీ చీఫ్ డి శ్రీనివాస్, డిప్యూటి సిఎం దామోదర రాజనర్సింహల పేర్లను సూటిగా ప్రస్తావించారు. వారు తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే వారైతే ఆ ప్రాంత సమస్యల గురించి మాత్రమే మాట్లాడేవారన్నారు.

ముఖ్యమంత్రిగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను దృష్టిలో పెట్టుకునే కిరణ్ మాట్లాడారని చెబుతున్నారు. పెద్దమనిషిగా వ్యవహరించే కేంద్రమంత్రి జైపాల్ రెడ్డికి సిఎంపై వ్యాఖ్యలు తగవని, డిఎస్, దామోదర రాజనర్సింహ తెలంగాణ కోసం ఏనాడూ ఉద్యమించలేదని కౌంటర్ ఇస్తున్నారు. మిగిలిన నేతలను దనుమాడుతున్నారు. కెసిఆర్‌కే భద్రత లేనప్పుడు ప్రజలకు ఎక్కడ ఉంటుందని ఉండవల్లి అన్నారు. తాను 1950 ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలోని దొరల దౌర్జన్య పాలనకు సంబంధించి తీసిన అంకుర్ అనే సినిమాను చూశానని, మళ్లీ అటువంటి భయంకరమైన పరిస్థితి వస్తుందేమోనని ఆందోళన వ్యక్తం చేశారు.

English summary

 Emboldened by chief minister N Kiran Kumar Reddy's remarks on the proposed bifurcation of the state, more Congress leaders have decided to jump into direct agitation for Samaikyandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X