కెసిఆర్ వల్లే: వర్మ 'అమెరికా'కు కెటిఆర్ కౌంటర్

హైదరాబాద్: కెసిఆర్ వంటి నాయకుడు లేనందువల్లే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇంతకాలమైన కలిసి ఉన్నాయని ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్టర్ వ్యాఖ్యలపై తెరాస సిరిసిల్ల శాసన సభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు కౌంటర్ ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ లాంటి వారు గుడ్డిగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు.

రాష్ట్ర విభజన పరిణామాలపై రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించిన విషయం తెలిసిందే. కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకొని ఘాటుగా ట్వీట్ చేశారు. కెసిఆర్ వంటి నాయకుడు లేనందువల్లనే అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇంతకాలమైనా కలిసి ఉన్నాయని ఇటీవల వర్మ వ్యాఖ్యానించారు.

KTR counter to Ram Gopal Varma

అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ నగరాలను కలిపే వంతెనను కూల్చివేసి వాటిని ఒకటి చేయగల సమర్థుడు.. కెసిఆర్ అంటూ ఎద్దేవా చేశారు. అసలు అలాంటి నేత అమెరికాలో పుట్టిఉంటే జీవితాన్ని ఎలా గడిపేవాడో తెలుసుకోవాలని ఉన్నదని పేర్కొన్నారు. తాగడం, ఇష్టమైన వాళ్లతో పోవడం తప్ప ఈ విభజన గొడవలేవీ అమెరికన్లకు లేవని, వాళ్ల నుంచి భారతదేశం ఎంతో నేర్పుకోవాల్సి ఉన్నదని అన్నారు.

అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇప్పటికీ కలిసి ఉన్నాయి. మనం మాత్రం విడిపోతున్నాం. అంటే కలిసి ఉండటం మనకు చేతగావడం లేదనే కదా! అక్కడి ఓటర్ల నుంచి మన ఓటర్లు, అక్కడి నాయకుల నుంచి మన నాయకులు నేర్చుకోవల్సి ఉంది'' అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో రాష్ట్రానికి దూరంగా ఉండటం సంతోషం కలిగిస్తోందని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+