సీమాంధ్రకు కౌంటర్: సోనియాకు ఫ్లెక్సీ గుడి, పూజ

సిడబ్ల్యూసిలో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి, కేంద్రం ప్రక్రియను ప్రారంభించడంతో సోనియా గాంధీని తెలంగాణ ప్రజలు దేవతగా భావిస్తున్నారని ఈ సందర్భంగా వారు అన్నారు. కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్‌లో ఈ ఫ్లెక్సీ గుడిని కట్టారు. దీనిని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ కార్యదర్శి సునీల్ రావు ఏర్పాటు చేశారు.
సునీల్ రావు నిర్మించిన ఈ ఫ్లెక్సీ గుడిని పొన్న, ఇతర కార్యకర్తలు ఆదివారం సందర్శించారు. పొన్నం వంటి నేతలు కొబ్బరికాయలు కొట్టగా, మహిళా కార్యకర్తలు సోనియాకు హారతి ఇచ్చారు. మరో విషయమేమంటే సోనియా ఫ్లెక్సీ పక్కన పొన్నం, మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షుడు రవీందర్ రావుల చిత్రాలను కూడా ఉంచారు.
విభజన నిర్ణయానికి సోనియా కారకులు అంటూ ఇటీవల చిత్తూరు జిల్లా తిరుపతిలో ఆమె చిత్ర పటానికి సమైక్యవాదులు సమాధి కట్టిన విషయం తెలిసిందే. దానికి కౌంటర్‌గా టి కాంగ్రెసు నేతలు ఫ్లెక్సీతో గుడి కట్టారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యాక సోనియాకు పూర్తిస్థాయి గుళ్లు తెలంగాణ ప్రజలు కడతారని వారు ఈ సందర్భంగా అన్నారు.












Click it and Unblock the Notifications