బాద్‌ షా ఫంక్షన్‌లో 'మెగా' హీరోల మాటలు

హైదరాబాద్: నందమూరి హీరోలకు, మెగాస్టార్ హీరోలకు మధ్య తెలుగు సినీరంగంలో ఓ పోటీ ఉంటుందని అందరూ భావిస్తారు. ఒక కుటుంబంపై మరో కుటుంబం ఆధిక్యత ప్రదర్శించడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాయని అందరూ అనుకుంటారు. ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ బాద్‌ షా ఆడియో విడుదల కార్యక్రమంలో మెగా హీరోల సినిమాలకు సంబంధించిన మాటలు వినిపించాయి.

యాంకర్‌గా సుమకు మంచి పేరుంది. యాంకరింగ్‌లో ఆమె అదరగొడుతోందనే విషయం అందరికీ తెలుసు. బాద్‌ షా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆమె తెలిసో, తెలియకో పాపులర్ అయిన మెగా హీరో పేటెంట్‌గా మారిన పదాలను వాడేశారు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోని కెవ్వుకేక అనే మాటను ఆమె జోష్ కోసం వాడారు. గబ్బర్ సింగ్ సినిమతో కెవ్వు కేక పదం మారుమోగుతున్న విషయం తెలిసిందే.

ఇకపోతే, రామ్ చరణ్ తేజ్ సినిమా టైటిల్ రచ్చను కూడా ఆమె అయాచితంగా వాడేశారు. రచ్చ రచ్చ చేయడానికంటూ ఆమె మాట్లాడారు. బాద్‌ షా ఆడియో విడుదల జోష్‌లో ఆ విషయాలను ఎవరూ పట్టించుకున్నట్లు లేదు. కానీ, కొందరు ఆ మాటలను పట్టుకుని సాగదీయాలని ప్రయత్నిస్తున్నారు.

Gabbar Singh-Rachcha-Baadshah

జూనియర్ ఎన్టీఆర్‌కు ఇతర హీరోలతో మంచి సంబంధాలే ఉన్నాయి. బాద్‌ షా షూటింగ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రామ్ చరణ్ తేజ వచ్చారు. ఆడియో విడుదల కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ రావాల్సింది. కానీ సున్నితమైన వ్యవహారం కావడంతో ఆయన మానుకున్నారు. బాద్‌ షా సినిమాకు మహేష్ బాబు నేపథ్య గళం (వాయిస్ ఓవర్) అందిస్తున్నారు. హీరోలంతా కలిసిమెలిసి ఉన్నప్పుడు ఫ్యాన్ ఎందుకు ఫ్రెండ్లీగా ఉండడానికి ప్రయత్నిస్తే మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+