జగన్ పార్టీలోకి నాగబాబు, పాలకొల్లుపై గురి?

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన సమయంలో సంస్ధాగత వ్యవహారాలపై, మద్దతు సమీకరణపై నాగబాబు పెద్ద యెత్తున కసరత్తు చేశారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన తర్వాత చిరంజీవి సభలను దూరం నుంచి చూస్తూ వచ్చారు. కానీ, కాంగ్రెసులోకి వెళ్లలేదు.
నాగబాబు, పవన్ కళ్యాణ్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ స్థితిలో ఓ టీవీ చానెల్‌లో నాగబాబు జగన్ పార్టీలో చేరబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నాగబాబుకు పాలకొల్లు శాసనసభ నియోజకవర్గం టికెట్ ఇవ్వడానికి వైయస్ జగన్ సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ తుడిచిపెట్టుకుపోతుందనే ఊహాగానాల మధ్య సమైక్యవాదంతో జగన్ ఊపు తెచ్చుకున్నాడని భావిస్తున్న తరుణంలో నాగబాబు వైయస్సార్ కాంగ్రెసు వైపు చూస్తున్నట్లు చెబుతున్నారు. తమ సొంత ప్రాంతం పాలకొల్లు నుంచి గెలవడం ద్వారా స్థానిక బలాన్ని సమకూర్చుకోవాలనే ఉద్దేశంతో నాగబాబు ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications