జియా ఖాన్ బాయ్‌ఫ్రెండ్‌కి నాగార్జున హెల్ప్?

సూరజ్ పంచోలీకి నాగార్జున తోడునీడగా ఉన్నట్లు హైదరాబాదుకు చెందిన ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. జియా ఖాన్ ఆకస్మిక మృతితో తీవ్ర మనస్తాపానికి, ఆందోళనకు గురైన సూరజ్ పంచోలీకి హైదరాబాద్‌కు చెందిన ఓ మంచి థెరపిస్టును నాగార్జున చూపించాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయంటూ దక్కన్ క్రానికల్ పత్రిక రాసింది.
హైదరాబాదులో ఉన్నప్పుడు ఆ థెరపిస్టు తరుచుగా సూరజ్ పంచోలీని కలిసినట్లు ఆ పత్రిక రాసింది. అయితే ఆ విషయం నిర్ధారణ కాలేదని కూడా చెప్పింది. ఈ విషయంపై నాగార్జున మాట కోసం కూడా ఆ పత్రిక ప్రయత్నించింది. ఈ విషయం దక్కన్ క్రానికల్ స్వయంగా రాసుకుంది.
నాగార్జున అందుబాటులో లేరని, ఓ టెలివిజన్ కమర్షియల్ కోసం అమితాబ్ బచ్చన్‌తో షూటింగులో పాల్గొనడానికి ముంబై వెళ్లాడని దక్కన్ క్రానికల్ రాసింది. ఏమైనా, నిప్పు లేనిదే పొగ రాదు కదా అని సినీవర్గాలంటున్నాయి.












Click it and Unblock the Notifications