హైదరాబాద్ కొట్లాట: రెండు పిల్లుల పోరు మధ్య..

హైదరాబాద్ నగరం కమ్యూనిస్టుల సొత్తని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలను మాట్లాడుతున్న సందర్భంలో ఇటు తెలంగాణతో పాటు అటు సీమాంధ్ర నేతలు హైదరాబాద్ మాదంటే మాదంటూ పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ మూమ్మటికీ కమ్యూ నిస్టుల పొత్తనే విషయాన్ని గ్రహించాలని ఆయన సూచించారు.
ఆదివారం ఆయన మీడియాతో ఆ మాటలన్నారు. తెలంగాణ సాధనలో అనుకూల శత్రువులు ఎక్కువగా వున్నారని అన్నారు. దోపిడీ దారులు, అవినీతి పరులు సమైకాంధ్ర ముసుగులో వున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో యుద్ధం ప్రకటించారని, అది ఢిల్లీలో చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సీమాంధ్ర ఉద్యమం స్వార్థమో, రాజకీయం కోసమో చేస్తున్నది కాదన్నారు. రాష్ట్ర విభజనతో తమకు అన్యాయం జరుగుతుందనే భయాందోళనల నేపథ్యంలో విద్యార్థులు, నిరుద్యోగ యువకులు, ఉద్యోగులు చేస్తున్నారని తెలిపారు. తమకు అన్యాయం జరగకూదడనే ఉద్దేశంతోనే వారు రోడ్డెక్కారని, ఇందులో పాల్గొంటున్న రాజకీయ నేతల పార్టీల మాత్రం ప్రజల్లో తమ పట్టును నిలుపుకునేందుకే ఉద్యమంలో భాగస్వాములవుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications