ఆంధ్రా భోజనం అడిగి తెప్పించుకున్న మోడీ

విమానాశ్రయం నుండి పార్క్ హయత్ హోటల్‌కు చేరుకున్న మోడీ.. మంచి ఆంధ్రా భోజనం కావాలని, ఏర్పాటు చేయాలని రాష్ట్ర బిజెపి నాయకులకు సూచించారు. వారు దానిని ఏర్పాటు చేశారు. మోడీ అక్కడే ఆంధ్రా భోజనం ఆరగించారు.
ఆంధ్రా భోజనం అడిగి తెప్పించుకున్న మోడీ నవ భారత యువ భేరీలోను తొలుత తెలుగులో ప్రసంగం చేసి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆయన శ్రీవేంకటేశ్వర స్వామిని తల్చుకొని, కాంగ్రెసుకు సద్బుద్ది ప్రసాదించాలని ప్రార్థించారు. అదే సమయంలో తమ రాష్ట్రంలో ఎన్నో తెలుగు పాఠశాలలు ఉన్నాయని చెప్పారు. అలాగే గుజరాత్‌కు, హైదరాబాదుకు సంబంధముందని, నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంస్థానాన్ని స్వతంత్ర భారతంలో విలీనం చేసేందుకు కృషి చేశారన్నారు.
ట్విట్టర్‌లో థ్యాంక్స్
నవ భారత యువ భేరీకి పెద్ద ఎత్తున యువత తరలి రావడం పట్ల నరేంద్ర మోడీ ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న యువతలోని ఉత్సాహం హైదరాబాదులో కనిపించిందని సోమవారం ట్విట్టర్‌లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications