అమ్మాయిల చీటింగ్: పరీక్షహాల్లోకి 'బ్రా'లు నిషేధం

లోహపు బ్రాలు ధరించిన వారిని గుర్తించేందుకు వీలుగా పలు ప్రాంతాలలోని పరీక్ష కేంద్రాలలో మెటల్ డిటెక్టర్ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష శుక్ర, శనివారాలు జరిగింది. దేశవ్యాప్తంగా 90 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. బ్రాలకు బదులు రెండు చొక్కాలు ధరించినట్లు విద్యార్థినులు తెలిపారు.
2008వ సంవత్సరంలో కొందరు విద్యార్థినులు బ్రాలో చిన్నపాటి కెమెరాలు పెట్టుకొని వచ్చి ప్రశ్నపత్రాల చిత్రాలను బయటకు పంపించారు. దీంతో జాతీయ పరీక్షల్లో బ్రాలపై నిషేధం విధించారు. యువతులు లోపల కెమెరాలు పెట్టుకొని రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నారు. జాతీయ పరీక్షల్లో టెక్నాలజీని ఉపయోగించి చీటింగ్‌కు పాల్పడుతున్న అంశంపై నిర్వాహకులు దృష్టి సారిస్తున్నారు.
కాగా కొద్ది రోజుల క్రితమే కొన్ని దేశాల్లో ప్రపంచ సుందరి పోటీలలో బికినీలను తొలగించేందుకు సిద్ధమయ్యారు. ప్రపంచ సుందరి పోటీలంటేనే ఓ ప్రత్యేకత. వారు చిట్టిపొట్టి దుస్తులు వేసుకుని మరీ కనిపిస్తారు. కానీ ఇండోనేసియా లాంటి ముస్లిం ప్రధాన దేశాల్లో వివాదాలను నివారించడానికి ఈసారి 'మిస్ వరల్డ్' పోటీల్లో బికినీ రౌండ్ ఉండదని నిర్వాహకులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications