మూడో పెళ్లి నమోదుకు పవన్ కళ్యాణ్ దరఖాస్తు?

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకున్నట్లు బుధవారం వార్తలు వచ్చాయి. సూర్య అనే తెలుగుదిన పత్రిక ఈ వార్తను ప్రచురించింది. సూర్య దినపత్రిక కథనం ప్రకారం - ప్రముఖ సినీ నటుడు పవన్‌కళ్యాణ్‌ మళ్ళీ వివాహం చేసుకున్నట్టు సమాచారం.

ఇప్పటికే రెండుసార్లు జరిగిన వివాహాలు వివాదాస్పదం అయిన నేపథ్యంలో మూడోసారి ఆస్ట్రేలియాకి చెందిన డొన్నా మార్క్ అనే కళాకారిణిని తాజాగా పెళ్ళి చేసుకున్నట్టు పుకార్లు షికార్లు చేశాయి. వీరిరువురి వివాహానికి సం బంధించి అధికారికంగా ప్రభు త్వానికి అఫిడవిట్‌ సమర్పించే ప్రక్రియ సైతం పూర్తయినట్టు సమాచారం.

Pawan Kalyan

ఒక తెలుగు సినిమాలో ఐటం సాంగ్‌లో నటించిన డొన్నాతో పవన్‌కళ్యాణ్‌ గత కొంత కాలంగా సహజీవనం కొనసాగిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఇటీవలే డాన్నాను వివాహం చేసుకున్నట్టుగా దృవీరణ నిమిత్తం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నట్టు సమాచారం.

అయితే అధికారికంగా పవన్‌ కళ్యాణ్‌ వివాహం చేసుకున్నట్టుగా వెలువడుతున్న వార్తలపై అధికారులు పెదవి విప్పకపోవడం విశేషమని ఆ పత్రిక రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+