నాడు పీకల్లోతు ప్రేమలో కేజ్రీవాల్ (పిక్చర్స్)

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, ఓటర్ల మనసును గెలుచుకొని ఏడాదిలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. సతీమణి సునీత. కేజ్రీవాల్ ఆమెను ప్రేమించి పెళ్లాడారు. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయి మరీ సునీతను ఒప్పించి వివాహమాడారు.

కేజ్రీవాల్, సునీతలది ఐఆర్ఎస్‌‍లో ఒకే బ్యాచ్. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. మొదట కేజ్రీవాలే సునీత ప్రేమలో పడ్డారు. ఐఆర్ఎస్ శిక్షణ అనంతరం ఇద్దరు ఉద్యోగాలు వచ్చే వరకు ఆగారు. వారికి ఒకేసారి ఢిల్లీలో ఐటి విభాగంలో ఉద్యోగాలు వచ్చాయి. ఆ తర్వాత వారు పెళ్లి చేసుకున్నారు.

వారికి ఒక బాబు, ఒక పాప. భార్య ప్రతిభకు కేజ్రీవాల్ ముగ్ధుడవుతుంటారు. ఆమెను నిజాయితీ ఉన్న, రాజీపడని, నిక్కచ్చి, చురుకుదనం గల వ్యక్తిగా కేజ్రీవాల్ ప్రశంసిస్తుంటారు. సునీత నిబద్ధత మూలంగా ఢిల్లీలో ఆమె సర్వీసును పదే పదే పొడిగిస్తున్నారని చెబుతుంటారు.

కాగా, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బిజెపికి గట్టి పోటీనిచ్చి 28 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌లో కేజ్రీవాల్ పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించకముందే షీలా దీక్షీత్‌ను ఓడిస్తానని శపథం చేశారు. అన్నట్లుగాగే దాదాపు 22వేల ఓట్ల మెజార్టీతో షీలాను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి ఓడించారు.

కేజ్రీవాల్ 1

కేజ్రీవాల్ 1

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హర్యానాలోని హిసార్‌లో జన్మించారు. అతను ఖరగ్‌పూర్ ఐఐటిలో చదివారు. 1992 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.

కేజ్రీవాల్ 2

కేజ్రీవాల్ 2

కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలో షీలా దీక్షిత్ ప్రభుత్వాన్ని మట్టికరిపించడమే కాకుండా, భారతీయ జనతా పార్టీని గడగడలాడించారు.

కేజ్రీవాల్ 3

కేజ్రీవాల్ 3

దేశంలో ఇప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గాలి వీస్తోంది. మోడీకి ధీటుగా కొన్ని ప్రాంతాల్లో అరవింద్ కేజ్రీవాల్ గాలి వీస్తోందని, ఢిల్లీ ఎన్నికలు నిరూపించాయంటున్నారు.

కేజ్రీవాల్ 4

కేజ్రీవాల్ 4

ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, ఓటర్ల మనసును గెలుచుకొని ఏడాదిలోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెసు, భారతీయ జనతా పార్టీకి చుక్కలు చూపిన ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. సతీమణి సునీత. కేజ్రీవాల్ ఆమెను ప్రేమించి పెళ్లాడారు.

కేజ్రీవాల్ 5

కేజ్రీవాల్ 5

ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆదాయపు పన్ను శాఖలో కొన్నేళ్లు పని చేశారు. ఆయన పరివర్తన్ ఉద్యమాన్ని ప్రారంభించారు.

ఢిల్లీలో ఆనందం

ఢిల్లీలో ఆనందం

ఢిల్లీలో గెలుపు కోసం అరవింద్ కేజ్రీవాల్ మూడు నెలలుగా అహర్నిషలు కష్టపడ్డారు. అతను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుండి షీలా దీక్షిత్‌ను ఓడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+