ఉదయభాను: చేదన్నా వినని రాజకీయ నేతలు

హైదరాబాద్: రాజకీయాలు తన ఒంటికి పడవని ప్రముఖ యాంకర్ ఉదయభాను మొత్తుకుంటున్నా రాజకీయ పార్టీల నేతలు మాత్రం తమ ప్రయత్నాలను మానలేదు. యాంకర్‌గా, సినిమా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకొన్న ఉదయభానును రాజకీయాల్లోకి తెచ్చేందుకు తెలంగాణాలోని వివిధ పార్టీల నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఉదయభానును పార్టీలోకి తీసుకుని రావడానికి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తీవ్రంగా ప్రయత్నాలు మొదలెట్టినట్లు తెలుస్తోంది. అదే సందర్భంలో తెలంగాణలోని ఇతర పార్టీల నేతలు కూడా ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నాయి. ఉదయభానును రాజకీయాల్లోకి తీసుకొస్తే మాత్రం కచ్చితంగా తమకు కలసివస్తుందని కొందరు నేతలు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆమె తెలంగాణ ప్రాంతా వాసి కావడంతో ప్రత్యేక సెంటిమెంటుకు ఉపయోగించుకోవాలని యోచిస్తున్నట్లు తెలిసింది.

Political parties woo Udaya Bhanu

తాను రాజకీయాలకు సరిపోవని ఉదయభాను చెబుతున్నారు. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ఆమె చెప్పారు. తనకు కొన్ని రాజకీయ పార్టీల నుండి ఆఫర్స్ వచ్చాయని, ప్రాధాన్యత కలిగిన పదవులు ఇస్తామని చెప్పారని కానీ, తాను అంగీకరించలేదన్నారు. తన కలం ద్వారా సమాజంలోని రుగ్మతల పైన పోరాడదల్చుకున్నట్లు చెప్పారు.

తాను రాజకీయాల్లో ప్రవేశించినా తాను ఒక్క దానినే సమాజాంలో మార్పును తీసుకు రాలేనన్నారు. తాను ఫ్రాంక్‌గా ఉంటానని, తాను రాజకీయాలకు సరిపోనన్నారు.. తాను సెన్సిటివ్ వ్యక్తినని చెప్పారు. ఇటీవల పాడిన పాటతో ఆమె మరింత చర్చనీయాంశంగా మారారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+