రజనీకాంత్ - మన్మోహన్ - ఓ రోబో: బాబు వ్యాఖ్య

Rajinikanth Robo is better than PM: Babu
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు, సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం రోబోకు ముడిపెట్టి మాట్లాడారు. శనివారం చంద్రబాబు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రజనీకాంత్ సినిమాలో రోబో శక్తివంతమైనదని కానీ, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి రోబోగా ఉన్న ప్రధాని మన్మోహన్‌కు మాత్రం ఆ శక్తి లేదని ఎద్దేవా చేశారు.

వ్యక్తిత్వ లేదని విమర్శలు గుప్పించారు. ఆమె ఏది చెబితే అదే మాట్లాడుతారని, ప్రధాని కార్యాలయం వివాదాస్పదంగా మారిందని ధ్వజమెత్తారు. అవినీతి ఆరోపణలకు మొదటి వేదిక ఆ కార్యాలయమే అన్నారు. రజనీ రోబో చురుగ్గా ఉంటుందని, మన్మోహన్ తీరు అలా కూడా లేదని ఎద్దేవా చేశారు.

అదే సమయంలో చంద్రబాబు కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పైన విరుచుకు పడ్డారు. కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్న ఆ పార్టీలు భూస్థాపితం కాకతప్పదని హెచ్చరించారు. తెరాస, జగన్ పార్టీల అండ చూసుకొని రెచ్చిపోతే మూడు పార్టీలూ భూస్థాపితం కావడం ఖాయమని కాంగ్రెస్‌ను హెచ్చరించారు.

కాంగ్రెస్ నేతలకు వెన్నెముక లేదని, రాష్ట్రాన్ని తగులబెడుతున్నారని, ఇక టీఆర్ఎస్ బ్లాక్‌మెయిల్ పార్టీ అని విమర్శించారు. వరదలొచ్చినా, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాల్సి ఉన్నా ఆయన ఫామ్‌హౌస్ వదిలి రారంటూ కేసీఆర్‌ను ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ తన రెండు కాళ్లూ నరుక్కుని, ఒక వైపు తెరాస, ఇంకో వైపు జగన్ పార్టీని పెట్టుకుని ఎన్నికల్లో నెగ్గాలని చూస్తోందని మండిపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+