'మేమూ, మళ్లీ వెళ్తావా': జగన్ స్పీచ్‌పై సెటైర్లు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంపై ఫేస్‌బుక్‌లతో పాటు పలు వెబ్‌సైట్లలో సెటైర్లు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల క్రితం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో సమైక్య శంఖారావ సభలో జగన్ మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడిన పలు అంశాలపై ఇంటర్నెట్లో వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. ప్రసంగంపై ప్రశ్నలు వేస్తున్నారు.
'ఇన్ని కబ్రులు చెప్పే బదులు రాష్ట్ర విభజన జరిగితే జన్మలో కాంగ్రెసుతో కలవనని ఒక్క మాట చెప్తే చచ్చినట్లు తెలంగాణకు సోనియా సడన్ బ్రేక్ వేస్తుంది వేస్తుంది' అంటూ జగన్ ప్రసంగంపై ఇంటర్నెట్లో కౌంటర్లు వేస్తున్నారు. 'విభజనపై కాంగ్రెసు నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే జగన్‌కు బెయిల్ వచ్చింది. అదే సమయంలో జగన్ సమన్యాయం నుండి సమైక్యాంధ్ర అంటూ రాగం అందుకున్నారు. వీటి ఉద్దేశ్యమేమిటి?' ప్రశ్నించారు. 'ఇలాంటి ఊకదంపుడు సభలను దోచిన డబ్బుంటే నేను కూడా పెట్టగలను.' అంటూ విమర్సలు గుప్పించారు. ఇక సెటైర్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

మళ్లీ ఇటలీకి వెళ్లిపోతావా అంటూ జగన్ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని సభలో ప్రశ్నించారు. దానికి నెట్లో సోనియా జగన్‌ను ఏం మళ్లీ జైలుకి పోతావా?? అంటూ హెచ్చరిస్తున్నట్లుగా ఉన్న ఫోటోను పెట్టారు. హిట్లర్ సేనలు జర్మనీలో చేసిన అకృత్యాల పైన ఓ జర్మన్ మేధావి రాసిన కవితను జగన్ తన ప్రసంగంలో చదివారు. దానికి ఫేస్‌బుక్‌లో కౌంటర్‌గా రాశారు.
'మొదట సిబిఐవాళ్లు శ్రీలక్ష్మి కోసం వచ్చారు.. నేను ఐఏఎస్‌ను కాదు కదా అనుకున్నా! తర్వాత మంత్రి మోపిదేవి కోసం వచ్చారు.. నేను మంత్రిని కాదు కదా అనుకున్నాను..! తర్వాత విజయసాయిరెడ్డి కోసం వచ్చారు.. నేను చార్టెర్డ్ ఎకౌంటెంట్ కాదు కదా అనుకున్నా..! ఆ తర్వాత నా కోసం వచ్చారు.. సీన్ కట్ చేస్తే.. చంచల్‌గూడ జైలులో నేను.. చెప్పుకోవడానికి ఎవరూ లేరు.. వా.. మమ్మీ...!!' అంటూ రాశారు.
జగన్ తన ప్రసంగంలో అడగదల్చుకున్నా అని పలుమార్లు అన్నారు. దాని పైనా సెటైర్లు వేశారు. 'నేను అడగదల్చుకున్నా.. నీకు "జన గణ మన'' వచ్చా.. రాదా అని!! నేను.. అడగదల్చుకున్నా... నువ్వు వదిలిన "బాణం'' ఏమైంది అని!! నేను అడగదల్చుకున్నా.. రాష్ట్ర విభజనకి కారణం అయిన "సోనియా''ని ,"కేసీఆర్''ని ఎందుకు విమర్శించలేదు అని!! నేను.. అడగదల్చుకున్నా... నీకు "బెయిల్'' ఎలా వచ్చింది అని!! నేను అడగదల్చుకున్నా... సోనియా ఇంటి ముందు.. నీ పార్టీ వాళ్లు ఎందుకు "ధర్నా'' చెయ్యలేదు అని!! నేను.. అడగదల్చుకున్నా.. సమైక్య సభలో "మత'' ప్రచారం ఏంటీ అని!!'
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications