రోజా మేకప్‌పై సైటెర్లు, నాగబాబుపైనా...

Satires on Roja makeup
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ నటి రోజా మేకప్‌పై ఓ టీవీ చానెల్ ఎపిసోడ్‌లో సెటైర్ల మీద సెటైర్ల కురుస్తున్నాయి. సినీ నటుడు నాగబాబుపైన కూడా సెటైర్లు కురుస్తున్నాయి. ఈటీవి చానెల్‌లో జబర్దస్ అనే కామెడీ షో ప్రసారమవుతోంది. ఈ షోకు నాగబాబు, రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

రోజాపై, నాగబాబుపై షో చేస్తున్న కళాకారులు జబర్దస్త్‌గా, తొణక్కుండా బెణక్కుండా సైటైర్లు, జోకులు విసురుతున్నారు. వాటిని ఆ ఇద్దరు కూడా ఆనందిస్తున్నట్లే కనిపిస్తున్నారు. రోజా మేకప్‌పై మాత్రం ఇటీవలి రెండు మూడు ఎపిసోడ్లలో విపరీతమైన సెటైర్లు కురిశాయి. ఇటీవలి ఎపిసోడ్‌లో నల్ల వేణు రజనీకాంత్‌ను అనుకరిస్తూ రోజా మేకప్‌పై వ్యంగ్యాస్త్రాలు విసిరాడు.

రజనీకాంత్ స్టైల్లో డైలాగు విసురతూ వేణు - అతిగా నవ్వే నాగబాబు, అతిగా మేకప్ వేసుకునే రోజా మార్కులు వేస్తున్న జబర్దస్త్ చరిత్రలో లేదు అనేశాడు. ఆమె మేకప్‌పై మరో సెటైర్ కూడా కురిసింది. వేదిక మీద ఓ మట్టి కుప్పపై వ్యాఖ్యానిస్తూ కళాకారులు - దాన్ని రోజా తీసేసిన మేకప్‌గా వ్యాఖ్యానించారు.

రోజా మేకప్ లేకుండా బయటకు రాదంటూ ఓ కామెంట్ కూడా ఓ ఎపిసోడ్‌లో వచ్చింది. ఓ ఎన్నారై సమావేశం ఎపిసోడ్‌ను తయారు చేసి, నాగబాబుపై సెటైర్ల మీద సెటైర్లు కురిపించారు. మొత్తం మీద, రోజా తనపై వచ్చిన సెటైర్లకు అలవాటు పడినట్లే కనిపిస్తున్నారు. ఆ మాటకు వస్తే - నాగబాబు కూడా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+