అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేకి సీమంతం ముచ్చట

ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఆమెకు పార్టీలకతీతంగా మహిళా ఎమ్మెల్యేలు సీమంతం నిర్వహించి అభిమానాన్ని చాటుకున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే గీతకు వచ్చిన ఈ ఆలోచనను తెలుగుదేశం ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి తదితరులు ప్రోత్సహించారు. సభ పదేపదే వాయిదా పడుతూ రావడంతో ఆ సమయాన్ని వీరు చంద్రావతి ముచ్చట తీర్చడానికి వాడుకున్నారు.
పూలు, పండ్లు తెప్పించి వేడుక నిర్వహించారు. అసెంబ్లీ క్యాంటీన్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తణుకు ఎమ్మెల్యే కారుమూరు నాగేశ్వరరావు, తెలుగుదేశం శాసనసభ్యులు పయ్యావుల కేశవ్, రేవంత్‌రెడ్డి తదితర పురుష శానససభ్యులు కూడా పాల్గొని అక్షింతలు వేశారు.
నిజానికి, ఇటువంటి సంప్రదాయాలకు కమ్యూనిస్టు పార్టీ అయిన సిపిఐ వ్యతిరేకం. కానీ తోటి ప్రజాప్రతినిధులను కాదనలేక చంద్రావతి అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. కాగా, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ కూతురు పెళ్లి ఇటీవల సంప్రదాయబద్దంగా జరగడంపై విమర్శలు వస్తున్నాయి.












Click it and Unblock the Notifications