తండ్రుల పిల్లలు: జగన్, నారా లోకేష్ ఒకేలాగా?

YS Jagan and Nara Lokesh
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయాలను ఇటీవలి కాలంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్‌కు మధ్య పోరాటంగా చూస్తున్నారు. అయితే, జగన్ మాత్రం తనకూ చంద్రబాబు నాయుడికి మధ్య పోరాటంగానే చూస్తున్నట్లున్నారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత వైయస్ జగన్ తన సొంత ముద్రను రాజకీయాలపై వేశాడు.

రాజకీయ దిగ్గజాలను ఢీకొనేందుకు సిద్ధపడ్డాడు. సొంత పార్టీని ఏర్పాటు చేసి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలపై పోరాటం సాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని గెలిపించి తీరాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాగా, రెండు సార్లు అధికారానికి దూరమైన తన పార్టీకి విజయం చేకూర్చి పెట్టే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు. ఆయనకు తనయుడు నారా లోకేష్ చేదోడువాదోడుగా నిలుస్తున్నాడు.

వైయస్ జగన్‌ రాజకీయాల్లోకి వచ్చి చాలా రోజులే అవుతుంది. నారా లోకేష్ మాత్రం ఇప్పుడిప్పుడే తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. జగన్ రాష్ట్ర, జాతీయ మీడియాతో అనర్గళంగా మాట్లాడుతారు. లోకేష్ ఈ మధ్యనే మీడియా ముందుకు వస్తున్నారు. కానీ, తడుముకోకుండా తన అభిప్రాయాలను చెప్చే నేర్పును అలవరుచుకున్నాడు.

కానీ, వైయస్ జగన్‌కు, నారా లోకేష్‌కు ఓ విషయంలో మాత్రం పోలిక ఉందని అంటున్నారు. ఇరువురు కూడా తమ తండ్రులను అనుకరిస్తున్నట్లు చెబుతున్నారు. హావభావాల విషయంలో, ప్రసంగ సరళిలో వారిద్దరు తమ తండ్రులను గుర్తుకు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత వైయస్ జగన్ ఆ బాడీ లాంగ్వేజ్‌ను అలవాటు చేసుకున్నట్లు చెబుతున్నారు.

చేయిని గాలిలో ఊపే విషయంలో, బహిరంగ సభలో మాట్లాడే తీరులో ఆయన వైయస్ రాజశేఖర రెడ్డిని తలపించే ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ తన తండ్రిని అచ్చు పోసినట్లు అనుకరిస్తున్నారని చెబుతున్నారు. మీడియాతో మాట్లాడే విషయంలో, ప్రజలనుద్దేశించి ప్రసంగించే విషయంలో, ముఖ కవళికల విషయంలో ఆయన చంద్రబాబును పోలినట్లే వ్యవహరిస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+