తెలంగాణపై మాటతో సరి: సోనియా డ్రామానే?

కోర్ కమిటీ సమావేశం తర్వాత తెలంగాణపై కేవలం ప్రకటన మాత్రమే వెలువడుతుందని అంటున్నారు. తెలంగాణ ఆకాంక్ష చాలా బలంగా ఉన్నదని, దాన్ని తాము గౌరవిస్తున్నామనే ప్రకటన చేయవచ్చునని అంటున్నారు. ఆ తర్వాత లోక్‌సభను రద్దు చేసి తక్షణం పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టే అవసరాన్ని తప్పించుకోవచ్చునని అంటున్నారు. తెలంగాణపై కచ్చితమైన మాట ఇస్తూ ప్రకటన చేయవచ్చునని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రం చర్యలు తీసుకోకపోవచ్చునని చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో తాము గెలిచిన తర్వాత ఏర్పడే పార్లమెంటులో బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇవ్వవచ్చునని ప్రచారం సాగుతోంది. తెలంగాణపై సందిగ్ఘతను తొలగిస్తామని దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటల్లోని ఆంతర్యం ఇదేనని అంటున్నారు. తెలంగాణను ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పడం ద్వారాస్థానిక ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికలలో గౌరవప్రదంగా పోటీ పడవచ్చునని భావిస్తున్నట్లు సమాచారం.
అలా చెప్పడం ద్వారా సమైక్యాంధ్రవాదులకు తగిన వెసులుబాటు కల్పించే అవకాశాలంటాయి. వచ్చే ఎన్నికల్లో తమను గెలిపిస్తే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని సీమాంధ్రలోనూ తమను గెలిపిస్తే తెలంగాణ తెస్తామని తెలంగాణలోనూ ప్రచారం చేసుకోవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద, కాంగ్రెసు భారీ వ్యూహానికే తెర తీసినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications