పివి హయాంలో సోనియాపై నిఘా వేశారా?

రాజీవ్ గాంధీ దుర్మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చేందుకు సోనియా ఆసక్తి చూపించలేదు. అప్పుడు పివి నరసింహా రావును ప్రధాని పదవి వరించింది. ఓ సందర్భంలో పూర్ లేడీ.. అంటూ సోనియాపై పివి సానుభూతితో కూడిన వ్యాఖ్య చేశారని, ఈ విషయాన్ని కొందరు ఆమె చెవిలో వేశారని తెలుస్తోంది. పివిపై ఆమె కోపం పెంచుకోవడానికి ఇదే ప్రధాన కారణమని చెబుతారు.అదే సమయంలో, తాను ప్రధానిగా ఉన్నప్పటికీ పార్టీలో సోనియా మరో అధికార కేంద్రంగా మారుతున్నారనే ఆందోళన పివిని వెంటాడేదట.
పివి, సోనియా మధ్య అంతరం పెరుగుతూ వచ్చిన సమయంలో సోనియా బ్రిటన్ పర్యటనకు వెళ్లారు. సహజంగానే ఆమె బ్రిటన్‌కు ఎందుకు వెళ్లారు? ఎవరిని కలుస్తున్నారు? రాజకీయపరమైన మద్దతు ఏదైనా కూడగడుతున్నారా? వంటి అనేక సందేహాలు ప్రధానిగా ఉన్న పివిలో తలెత్తాయి. ఈ సందేహాలకు సమాధానాలు కనుగొనేందుకే సోనియా కదలికలపై నిఘా వర్గాలు కన్నేశాయట. పివి హయాంలో తనపై నిఘా వేయడంపై సోనియాకు ఆగ్రహం పెంచిందనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.












Click it and Unblock the Notifications