పిచ్చి: మరో అమ్మాయికి శ్రీశాంత్ మొబైల్

రెండో ఫోన్‌ను కూడా కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండో మొబైల్ బ్లాక్ బెర్ీ బోల్డ్‌ను శ్రీశాంత్ కుటుంబ స్నేహితురాలి నుంచి స్వాధీనం చేసుకున్నామని, శ్రీశాంత్ ఆమెకు ఆ ఫోన్ బహూకరించాడని, దాన్ని అతను జైపూర్‌లో కొన్నాడని పోలీసులు చెప్పారు.
మొత్తం మీద, శ్రీశాంత్ విషయంలో తవ్వుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. స్పాట్ ఫిక్సింగ్ వ్యవహారంలో పోలీసులు రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన శ్రీశాంత్, అజిత్ చండిల, అంకిత్ చవాన్‌లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
శ్రీశాంత్ తంత్రాలకు రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కూడా విసిగిపోయింది. దాంతో అతన్ని మే 15వ తేదీన్నే అధికారికంగా తొలగించినట్లు చెబుతున్నారు. చండిల మాత్రం స్పాట్ ఫిక్సింగ్‌లో పండిపోయినట్లు చెబుతున్నారు. అతను ఐపియల్ ఐదులో కూడా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications