కొన్నారా?: నిత్యానందకు కుంభలో రొంబ ఛాన్స్!
రాసలీలల కేసుతో పాటు పలు వివాదాల్లో చిక్కుకున్న నిత్యానంద స్వామికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రముఖ నటి రంజితతో రాసలీలలు మొదలు పలు వివాదాల్లో నిత్యానంద కూరుకుపోయారు. అలాంటి నిత్యానందకు ఉత్తర భారతదేశంలో జరుగుతున్న మహా కుంభ మేళా సందర్భంగా మరో గుర్తింపు వచ్చింది. నాగా సాధువులకు చెందిన మహా నిర్వాణి అఖాడా నిత్యానందను ఘనంగా సన్మానించింది.
ఆయనకు మహా మండలేశ్వర్ అనే బిరుదును బహూకరించింది. దక్షిణ భారత దేశ సాధువులకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే భావన పలువురిలో ఉన్నదని, దానిని తొలగించేందుకు నిత్యానందను సత్కరించినట్లు అఖాడా కార్యదర్శి చెప్పారు. నిత్యానంద స్వామిపై వచ్చిన విమర్శల గురించి ప్రశ్నిస్తే.. నిత్యానందపై వచ్చిన వ్యక్తిగత ఆరోపణలకు తాము స్పందించమని, వాటితో తమకు సంబంధం లేదన్నారు. నిత్యానందపై వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదని చెప్పారు.

అయితే, వివాదాల నిత్యానందకు మహా మండలేశ్వర బిరుదును ఇవ్వడాన్ని మరికొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు నిత్యానంద స్వామికి పదవులు కొనడం కొత్త కాదనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. గతంలో నిత్యానందకు మధురై ఆధీనం పీఠాధిపతిగా ప్రకటించడం వివాదాస్పదమైంది. దాంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఉత్తర భారత సాధువులు మహా మండలేశ్వర బిరుదు ప్రధానం చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications