చెర్రీ రచ్చ: టెక్కీలపై చిరు సెక్యూరిటీ గార్డులా..

Techies were bashed up by Chiranjeevi's security men: report
హైదరాబాద్: టెక్కీలతో కేంద్ర మంత్రి చిరంజీవి తనయుడు, సినీ నటుడు రామ్ చరణ్ తేజ రచ్చ కొత్త మలుపు తీసుకుంటోంది. తన మనుషులు టెక్కీలపై దాడి చేసినట్లు వచ్చిన ఫొటోలు మార్ఫింగ్ చేసివని ఇటీవల రామ్ చరణ్ తేజ చెబుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆంగ్లదినపత్రికను ప్రస్తావిస్తూ మీడియాను తప్పు పట్టారు. దీంతో వివాదం మరో మలుపు తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇద్దరు టెక్కీలపై దాడి చేసిన వారు ఇంటలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ (ఐఎస్‌డబ్ల్యు)కి చెందినవారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. వారికీ చిరంజీవికి సంబంధం అంటగడుతూ టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాకథనాన్ని ప్రచురించింది. తాజ్ కృష్ణాకు లంచ్ కోసం రామ్ చరణ్ తేజ, ఆయన భార్య వెళ్తుండగా బంజారాహిల్స్‌లో ఈ సంఘటన ఆదివారంనాడు చోటు చేసుకుంది.

ఈ సంఘటనపై టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన వార్తాకథనం పలు అనుమానాలకు దారి తీస్తోంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం - రాష్ట్ర ఇంటలిజెన్స్ శాఖ కింద పనిచేసే ఐఎస్‌డబ్ల్యూ మావోయిస్టుల నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి, వామపక్ష తీవ్రవాదానికి సంబందించిన సమాచారాన్ని సేకరించడానికి పని చేస్తుంది. కానీ రాజకీయంగా దుర్వినియోగం చేయడం తరుచుగా జరుగుతోందంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది.

మొత్తం మీద, వివాదంలోకి టైమ్స్ ఆఫ్ ఇండియా నేరుగా వివాదంలోకి లాగింది. సంఘటనలో ఎవరిపై కేసు నమోదు చేయాలో తెలియక టెక్కీలకు నచ్చజెప్పారని, చొక్కాలు కూడా చిరిగిన టెక్కీలకు సర్దిచెప్పి కేసు నమోదు కాకుండా చూశారని టైమ్స్ ఆఫ్ ఇండియా వ్యాఖ్యానించింది. మొత్తం మీద, వివాదం చిలికి చిలికి గాలివానగా మారే పరిస్థితి ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+