క్రికెటర్ శ్రీశాంత్ లీలలపై తెలుగు సినిమా?

హైదరాబాద్: ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న పేస్ బౌలర్ శ్రీశాంత్ వ్యవహారాలను ఆధారం చేసుకుని తెలుగులో సినిమా రాబోతున్నట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. న్యూ ఏజ్ సినిమాకు ఒరవడి పెట్టిన మధుర శ్రీధర్ ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. శ్రీశాంత్ జీవితం, అతని ప్రేమయణాలు, తారలతో అతనికి గల సంబంధాలు ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందుతుందని అంటున్నారు.

శ్రీశాంత్ వ్యవహారాలను ఆసరా చేసుకుని క్రికెటర్ల ఆప్ ఫీల్డ్ వ్యవహారాలను తెర మీదికి ఎక్కించాలనేది ప్రయత్నమట. శ్రీశాంత్‌కు అమ్మాయిలతో గల సాన్నిహిత్యాన్ని, నైట్ పార్టీల వ్యవహారాలను, లైంగిక దోపిడీని చిత్రంలో చూపించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారాల వల్ల జెంటిల్‌మెన్ గేమ్ క్రికెట్ అప్రతిష్ట పాలు ఎలా అయిందనేది చూపిస్తారట.

Sreeshanth

సినీ గ్లామర్‌నూ ఇతరత్రా గ్లామర్‌నూ జోడించడం వల్ల క్రికెట్ ఎలా వివాదాల్లో చిక్కుకుందో చెప్పాలనేది మధుర శ్రీధర్ ప్రయత్నమని అంటున్నారు. ఐపియల్ వచ్చిన తర్వాత చీర్ గర్ల్స్ హడావిడి కూడా క్రికెట్ చుట్టూ వివాదాలు అల్లుకోవడానికి కారణమైంది.

కొంత మంది క్రికెటర్లు అమ్మాయిల మోజులు పడడం, దానికి బెట్టింగ్ మాఫియా సహకరించడం అనేది కూడా సినిమాలో ఉంటుందని అంటున్నారు. క్రికెట్ బెట్టింగ్‌కు ఇందులో ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెబుతున్నారు. గ్లామర్, రోమాన్స్ కలిసి బెట్టింగ్‌కు ఎలా తోడ్పడుతున్నాయో కళాత్మకంగా చెప్పాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+