ఐదుకోట్లు బాకీపడ్డ టిఎస్సార్: చెల్లించలేనని..!

బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 2లోని టిఎస్సార్‌కు చెందిన పార్క్ హయత్ 7 స్టార్ హోటల్ ఆస్తి పన్ను రూ.3.5కోట్లు చెల్లించాల్సి ఉందట. ఈ మొత్తాన్ని చెల్లించాలని జిహెచ్ఎంసి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే, సుబ్బిరామి రెడ్డి మాత్రం తాను అంత మొత్తం చెల్లించలేనంటూ మూడు రోజుల కిందటే కోర్టును ఆశ్రయించారు.
సోమాజిగూడలోని దీపా ఎంటర్ ప్రైజెస్ పేరుతో సుబ్బిరామి రెడ్డికి ఉన్న ఆరు వేరువేరు ఇంటి నెంబర్ల పైన రూ.1.5 కోట్ల ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లుగా తెలుస్తోంది. మూడేళ్లుగా వీటిపై ఆయన పన్నులు చెల్లించడం లేదట.
ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన సుబ్బిరామి రెడ్డి రాజకీయ రంగంలో రాణిస్తున్నారు. ఆయన పలుమార్లు విశాఖపట్నం నుండి లోకసభకు పోటీ చేసి గెలిచారు. గత ఎన్నికల్లో అధిష్టానం సూచనల మేరకు విశాఖను కేంద్రమంత్రి పురంధేశ్వరికి వదులుకోవాల్సి వచ్చింది. ఇటీవల ఆయన మళ్లీ విశాఖ సీటుపై మక్కువ పెంచుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు లోకసభ నుండి పోటీ చేసి మేకపాటి రాజమోహన్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూశారు.












Click it and Unblock the Notifications