కెసిఆర్‌కు ఝలక్: తిరిగి కాంగ్రెస్‌లోకి వివేక్?

కాంగ్రెసు పార్టీ ఎప్పటికప్పుడు తెలంగాణ ఇస్తానని చెప్పి మోసం చేస్తోందని, తెలంగాణ ఇచ్చే పరిస్థితి లేనందున తాము ఉద్యమ పార్టీ అయిన తెరాసలో చేరినట్లు వారు చెప్పారు. అయితే కాంగ్రెసు పార్టీ అధిష్టానం తెలంగాణపై జోరుగా చర్చిస్తున్న నేపథ్యంలో, అనుకూలంగానే నిర్ణయం ఉంటుందనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. అధిష్టానం తెలంగాణకు అనుకూలంగా ఉందని తెలంగాణ కాంగ్రెసు నేతల్లో ధీమా కనిపిస్తోంది.
సీమాంధ్ర నేతల్లో కూడా ఆందోళన కనిపిస్తోంది. తాజా పరిణామాలు గమనిస్తుంటే పార్లమెంటు సమావేశాలకు అటు ఇటు తెలంగాణపై ప్రకటన చేయనుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో జి.వివేక్ వంటి నేతలు తిరిగి కాంగ్రెసులోకి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు. వారితో తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేతలు కూడా చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. వివేక్ తిరిగి కాంగ్రెసులో చేరితే కెసిఆర్‌కు ఊహించని దెబ్బే అంటున్నారు.
వివేక్ వ్యాఖ్యలు చూసినా కాంగ్రెసు తెలంగాణ ఇస్తే సొంత గూటికి తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం వివేక్ మాట్లాడుతూ... కాంగ్రెసు తెలంగాణ ఇస్తే తిరిగి ఆ పార్టీలోకి వచ్చే అంశాన్ని పరిశీలిస్తానని చెప్పారు. ఈ రోజు (మంగళవారం) వివేక్ ఎంపి సురేష్ షెట్కార్ నివాసంలో పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ తదితరులతో భేటీ అయ్యారు. తిరిగి వచ్చే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. అయితే తమ మధ్య రాజకీయ చర్చ జరగలేదని, తమ మధ్య ఉన్న స్నేహం కారణంగానే వచ్చానని వివేక్ చెబుతున్నారు.












Click it and Unblock the Notifications