అదే వచ్చు: రాయడం రాదన్న సంజయ్ దత్

ఖైదీలు తమకు కావాల్సిన వాటిని కాగితంపై రాసి ఇవ్వాల్సి ఉంటుంది. అలా కావాల్సిన వారు వాటిని రాసివ్వాలని సిబ్బంది ఓ పెన్ను, పేపర్ అందరికి ఇచ్చినట్లుగానే సంజయ్ దత్‌కు ఇచ్చింది. అప్పుడు అతను... తన సహాయకుడ రాసిస్తే సంతకం పెట్టడమే తనకు తెలుసునని, రాయడం రాదని చెప్పాడట.
ఆ తర్వాత తనకు కావాల్సిన వస్తువుల జాబితాను మరో వ్యక్తితో రాయించుకొని జైలు సిబ్బందికి ఇచ్చినట్లుగా సమాచారం. తనకు రాదని సంజయ్ చెప్పడంతో ఆయనకు నిజంగానే రాయడం రాదా లేక రాసి ఇవ్వడం చిన్నతనం అనిపించి అలా చెప్పాడా అర్థం కాక జైలు సిబ్బంది తలలు పట్టుకున్నారట.
పోలిస్‌గిరి సినిమా ట్రయలర్ లాంచ్‌లో సంజయ్ దత్ కుటుంబ సభ్యులు
సంజయ్ దత్ నటించిన పోలీస్‌గిరి ట్రయలర్ లాంచ్ వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సంజయ్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోదరి ప్రియాదత్, బావ కుమార్ గౌరవ్‌లు ఈ వేడుకకు వచ్చారు. ఈ సందర్భంగా నిర్మాత అగర్వాల్ మాట్లాడుతూ... సంజయ్ దత్ అరెస్టు కావడం దురదష్టకరమని అన్నారు.
అయితే ఆయనకు బదులు ప్రియ, కుమార్ రావడం ఆనందకరమన్నారు. సంజయ్ దత్, ప్రాచీ దేశాయ్ నటించిన ఈ సినిమా జూలై 5న విడుదల కానుంది. సంజయ్ జైలులో ఉన్న కారణంగా సినిమా ఫస్ట్ లుక్‌ను ప్రాచీ దేశాయ్ విడుదల చేశారు.












Click it and Unblock the Notifications