సురెజ్ దారిలో మహిళ: పోలీసు చెవి కొరికేసింది

ధంకవాడిలోని పంచాంగ భవనం వద్ద ఇంటి యజమానితో అద్దెకుంటున్నవారు గొడవపడుతున్న విషయాన్ని పోలీసు కంట్రోల్ రూం సహకార్ నగర్ పోలీసులకు చెప్పింది. అసెస్టింట్ ఇన్‌స్పెక్టర్ పాటిల్ తన సిబ్బందితో అక్కడికి వెళ్లి ఇద్దరిని చౌకీకి రమ్మన్నారు.
అద్దెకుంటున్న తన్వీ సగ్వేకర్ (23), ఆమె ఫ్రెండ్ యోగినాథ్ నాయక్ (33), ఇంటి యజమాని ఆదివారం సాయంత్రం 5 గంటలకు చౌకీకి వచ్చారని, పాటిల్ ప్రశ్నించడంతో ఆ ఇద్దరు వాగ్వివాదానికి దిగారని, పాటిల్ జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించారని, అకస్మాత్తుగా తన్వీ కుర్చీ నుంచి లేచి పాటిల్ చెవి కొరికిందని చెప్పారు.
తన్వీని, నాయక్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పాటిల్‌ను సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. సబ్ ఇన్‌స్పెక్టర్ శైలజా జంకార్ కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications