61 ఏళ్ల మహిళ మెడలో తొమ్మిదేళ్ల బాలుడి తాళి
ముంబై: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయని అంటారు. 61 ఏళ్ల మహిళ మెడలో తొమ్మిదేళ్ల బాలుడు తాళి కట్టడం కూడా స్వర్గంలో నిర్ణయం జరిగిందా అనే ఆశ్చర్యం కలగకమానదు. పైగా, ఈ దంపతులకు ఇది రెండో సారి వివాహమట.
తొమ్మిదేళ్ల పసిబాలుడు సానీ మసిలెలె రెండు సార్లు వివాహం చేసుకున్న అతి పిన్న వయస్కుడు కావచ్చు. అతను హెలెన్ శబాంగు నిరుడు ఓసారి పెళ్లి చేసుకున్నాడు. మరోసారి ఈ ఏడాది వివాహం చేసుకున్నాడు.

మృతి చెందిన తన పూర్వీకులు పెళ్లి చేసుకోవాలని చెప్పారని ఆ బాలుడు అంటున్నాడు. అతని తల్లిదండ్రులు, పెళ్లి కూతురు ఈ పెళ్లికి అంగీకరించి, పెళ్లి తంతు నిర్వహించారు. హెలెన్‌కు ఇప్పటికే వివాహమైంది. ఆమె భర్త ఆల్ఫ్రెడ్ వివాహానికి హాజరు కావడమే కాకుండా వారిని దీవించాడు కూడా.
పెళ్లికి సంబంధించిన సీరియస్‌నెస్ బహుశా ఆ బాలుడికి తెలిసి ఉండదు. అయితే, ఆ బాలుడితో హెలెన్ కాపురం చేయదట. తంతులో భాగంగానే ఈ వివాహం జరిగిందని అంటున్నారు.












Click it and Unblock the Notifications