మహేష్ బావ జయ్‌దేవ్‌కు సునీల్ ప్రచారం

హైదరాబాద్: ప్రిన్స్ మహేష్ బాబు బావ గల్లా జయదేవ్‌కు సినీ ప్రముఖుల మద్దతు పెరుగుతోంది. తాజాగా ఆయన తరఫున ప్రచారం చేయడానికి ప్రముఖ సినీ నటుడు సునీల్ ముందుకు వచ్చారు. ఆయన తరఫున మహేష్ బాబు కూడా ప్రచారం చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.

గల్లా జయదేవ్ ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే తన ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఆయన సినీ తారల మద్దతు పుష్కలంగా ఉందని చెబుతున్నారు. మహేష్ బాబు మాత్రమే కాకుండా హాస్య నటుడు, హీరో సునీల్ ను ప్రచారానికి ఉపయోగించుకోనున్నట్లు సమాచారం.

Actor Sunil to campaign for Galla Jayadev

ఆ విషయాన్ని స్వయంగా సునీల్ ప్రకటించాడు. తాను గల్లా జయదేవ్ తరపున ఎన్నికల ప్రచారం చేస్తానని అన్నాడు. వ్యాపారవేత్తగా విజయం సాధించిన గల్లా జయదేవ్ ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి రావడం శుభపరిణామమని సునీల్ అన్నారు.

జయదేవ్ కోసం తను పర్యటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. గల్లా జయదేవ్ మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి పుత్రుడు కూడా. చాలా కాలంగా జయదేవ్ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తున్నారు. కాంగ్రెసు నుంచి ఆయనకు ఆ అవకాశం రాలేదు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీలో చేర్చుకుని గుంటూరు లోకసభ సీటు ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+