మోడీ ఎఫెక్ట్ ట్విస్ట్: బిజెపిలోకి నటి నమిత?
హైదరాబాద్: తన అందాలతో వెండితెరపై ఆరోబోసిన నటి నమిత రాజకీయాల్లో తన సత్తా చాటాలని అనుకుంటోంది. తాను త్వరలో రాజకీయాల్లోకి వస్తానంటూ ఆమె చెప్పింది. అయితే, తాను ఏ పార్టీలో చేరబోయేది సస్పెన్స్‌గానే ఉంచింది.
తమిళనటి నమితకు సినిమాల్లో పెద్దగా అవకాశాలు లభించడం లేదు. రాజకీయాలవైపు దృష్టి సారించినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో సత్తా చాటిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీలో నమిత చేరుతారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే, ఆ వార్తలను ఆమె ఖండించింది.

ఆమ్ ఆద్మీ పార్టీలో చేరబోతున్నట్లు తాను ఏనాడూ చెప్పలేదని అంటూ అన్యాపదేశంగా ఆమె తన అభిమతాన్ని వెల్లడించింది. నరేంద్రమోడీ గుజరాత్‌ను గొప్పగా తీర్చిదిద్దిన నాయకుడిని మాత్రమే తాను గతంలో వ్యాఖ్యానించానని, అంతే తప్ప ఇతరాలేవీ చెప్పలేదని అన్నది. దీన్నిబట్టి నమిత బిజెపిలో చేరే అవకాశాలున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తనకు మొదటినుంచీ రాజకీయాలంటే ఇష్టమని, అయితే అవకాశం రాలేదని ఆమె తెలిపింది. ప్రస్తుతం తన శ్రేయోభిలాషులు, తన అభిమానులు రాజకీయాల్లోకి రావలసిందిగా కోరుతున్నారని చెప్పింది. తాను ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నట్లు చెప్పింది.












Click it and Unblock the Notifications