సైకిల్‌పై స్వారీకి ఆనం బ్రదర్స్ సిద్ధం?

హైదరాబాద్‌: కాంగ్రెసులో హల్‌చల్ చేస్తూ వచ్చిన ఆనం బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలోకి జంప్ చేస్తారట. మాజీ మంత్రి రాంనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డిలు తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశాలున్నాయని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాజకీయంగా పోయింది.

కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి సమీప భవిష్యత్తులో కూడా కాంగ్రెసు పరిస్థితి బాగుపడే సూచనలు లేకపోవడంతో టడిపిలో చేరడానికి వారు నడుం బిగించారని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి మృతి తరువాత అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌రెడ్డి అండతో రాజకీయంగా మరింతగా ఎదిగారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడంలో వీరిద్దరు దూకుడు ప్రదర్శించారు.

Anam brothers may jump into TDP

భవిష్యత్తు అంధకారమయం కావడంతో త్వరలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకుందామని చూస్తున్న కాంగ్రెస్‌ మాజీల జాబితాలో ఆనం సోదరుల పేర్లు ముందున్నాయని విశ్వసనీయవర్గాల బోగట్టా. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా అందుకు సుముఖంగానే వున్నారని అంటున్నారు.

ఆనం బ్రదర్స్ తమ పార్టీలో చేరితే నెల్లూరు జిల్లాలో తిరుగు ఉండదనే అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీని మరింత బలంగా ఎదుర్కోవచ్చునని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+