కోహ్లీతో డేటింగ్: కలిసేందుకొస్తున్నాడని అనుష్క
ముంబై: భారత స్టార్ బ్యాట్సుమెన్ విరాట్ కోహ్లీ కేవలం తనకు స్నేహితుడు మాత్రమేనని, తాము డేటింగ్ చేయడం లేదని అనుష్క శర్మ అంటోంది. కోహ్లీ - అనుష్కల మధ్య ప్రేమ, డేటింగ్ అంటూ గుసగుసలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరిద్దరు కలిసి ఓ అడ్వర్టైజ్‌మెంట్‌లో కనిపించారు. ఆ తర్వాత నుండి వారి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయట.
కొంతకాలంగా అనుష్క, విరాట్‌లు డిన్నర్, డేటింగ్, లాంగ్ డ్రైవ్‌లతో గడుపుతున్నట్లుగా మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ స్పందించింది. కోహ్లీ తనకు మంచి మిత్రుడని చెప్పింది. అతను ముంబైలో ఉన్నప్పుడు తనను చూసేందుకు వస్తాడని అంగీకరించింది.

తాను కోహ్లీతో డేటింగ్ చేయలేదని, తమ మధ్య స్నేహ సంబంధం మాత్రం రోజు రోజుకు పెరుగుతోందని, అతను ముంబైలో ఉన్నప్పుడు తనను చూసేందుకు వస్తాడని, స్నేహ సంబంధానికి మించి మరే సంబంధం లేదని అనుష్క అంటోంది.
కాగా, గతంలో బోనీ కపూర్ తనయుడు అర్జున్ కపూర్, రణవీర్ సింగ్‌లతో అనుషఅక శర్మ డేటింగ్ బాలీవుడ్లో పతాక శీర్షికల్లో నిలిచింది. ఇప్పుడు కోహ్లీతో అనుష్క రిలేషన్ హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications