చంద్రబాబు 'సెకండ్' ప్లాన్: బాలకృష్ణ పోటీ చేస్తారా?

రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని బాలకృష్ణ మొదటి నుండి భావిస్తున్నారు. గుడివాడ లేదా హిందూపురం తదితర నియోజకవర్గాల పైన బాలకృష్ణ దృష్టి సారించారు. ఏదో ఒక నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావిస్తున్నారు.
అయితే, ప్రచారం పేరుతో బాలయ్యకు కేవలం ప్రచార బాధ్యతలు మాత్రమే అప్పగించి, ఎన్నికలలో పోటీకి దూరంగా పెట్టడం వెనుక చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక వైఖరి అవలంభిస్తున్నారని అంటున్నారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుందని చంద్రబాబు నాయుడు, టిడిపి క్యాడర్ బలంగా నమ్ముతోంది. విభజన నేపథ్యంలో సీమాంధ్రను అభివృద్ధి చేసే శక్తి చంద్రబాబుకే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల అనంతరం టిడిపి అధికారంలోకి వచ్చాక... పార్టీలో రెండో పవర్ సెంటర్ ఉండకుండా చేసేందుకే చంద్రబాబు బావమరిదిని పోటీ నుండి తప్పించాలని భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
సీమాంధ్రలో టిడిపి గెలిచి.. బాలయ్య, చంద్రబాబు ఇద్దరు అసెంబ్లీకి వస్తే రెండో పవర్ సెంటర్ కచ్చితంగా మారుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో దానిని తప్పించుకోవడానికి అధినేత బాలయ్యకు కేవలం రెండు ప్రాంతాల్లో ప్రచార బాధ్యతలు మాత్రమే అప్పగించే అవకాశాలున్నాయంటున్నారు.












Click it and Unblock the Notifications