వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బెట్ ఓడిన ఒబామా: కెనడా ప్రధానికి 2 బీర్ కేసులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Barack Obama sends beer to Canada PM after losing hockey bet
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు బరాక్ ఒబామా కెనడా ప్రధాని స్టీఫెన్ హార్బర్‌కు రెండు కేసుల బీరును పంపించారు. బెట్టులో ఓడిపోయినందుకు ఒబామా ఈ బీరును పంపించారట. సోచిలో ఇటీవల వింటర్ ఒలింపిక్స్ జరిగిన విషయం తెలిసిందే. సోచి ఒలింపిక్స్ సందర్భంగా ఐస్ హాకీ పురుషుల సెమీ ఫైనల్లో కెనడాపై అమెరిగా నెగ్గుతుందని హార్పర్‌తో ఒబామా బెట్ కట్టారు.

పందె రెండు కేసుల బీర్. కెనెడా 1-0తో అమెరికాపై నెగ్గింది. దీంతో ఒబామా బెట్టింగులో ఓడిపోయారు. అంతేకాదు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ఒమాబా ఆదేశాలతో వైట్ హౌస్ రెండు కేసుల బీర్ బాటిల్స్‌ను కెనడా ప్రధానికి పంపించింది. ఈ విషయాన్ని ట్విట్టర్‌లో కెనడా ఎంబసీకి తెలిపింది.

'హే.. కెనడా గెలిచినందుకు శుభాకాంక్షలు. అమెరికా అధ్యక్షుడి నుండి కెనడా ప్రధాని హార్పర్ కోసం రెండు కేసుల ప్రెష్ బీర్ పంపిస్తున్నాం చూడండి. ఈ ఆనందకర క్షణాలను ఆస్వాదించండి' అని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ట్వీట్ చేసింది.

అయితే ఈ బీర్ మామూలుది కాదు. వైట్ హౌస్‌లోని తోట నుంచి సేకరించిన తాజా తేనెతో దీనిని ప్రత్యేకంగా తయారు చేశారు. ఒబామా... హార్పర్‌తో బెట్టు కట్టి ఓడిపోవడం ఇది రెండోసారి. నాలుగేళ్ల క్రితం వాంకోవర్ వేదికగా జరిగిన వింటర్ ఒలింపిక్స్‌లోను ఓడిపోయారు. అప్పుడు కూడా యూంగ్ లింగ్ బీర్‌ను పంపారు.

English summary
The White House will deliver two cases of beer to the Canadian Embassy on Monday after US President Barack Obama lost an Olympic ice hockey bet to Prime Minister Stephen Harper. Canada's men beat their fierce local rivals 1-0 in the semi-finals in Sochi, Russia last month while the women's team stormed back to see off the US 3-2 and snatch gold.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X