బోర్డుల తిరగమోత: రాజీనామా బాట (ఫొటోలు)

హైదరాబాద్: తెలంగాణ బిల్లు లోకసభలో ఆమోదం పొందిన వెంటనే రాష్ట్రంలోని ఇరు ప్రాంతాల్లో పరిస్థితి మారిపోయింది. తెలంగాణలో సంబురాలు జరుగుతుంటే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. లోకసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభలో ఆమోదం పొందడం లాంఛనమే అనే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు. దీంతో వారు ఇప్పుడే బోర్డులు మార్చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదాన్ని స్థానభ్రంశం చేస్తున్నారు.

కాగా, రాష్ట్ర విభజనకు నిరనసగా సీమాంధ్ర శాసనసభ్యులు రాజీనామా బాట పట్టారు. కాంగ్రెసు శాసనసభ్యులు పార్టీకి, శాసనసభా సభ్యత్వాలకు రాజీనమాలు చేస్తుంటే, తెలుగుదేశం శాసనసభ్యులు తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామాలు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో కాంగ్రెసు శాసనసభ్యుల రాజీనామాలు పెరగవచ్చునని భావిస్తున్నారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెసులో సీమాంధ్ర ప్రాంతంలో ఓ బలమైన లాబీ ఏర్పడినట్లు అర్థమవుతోంది.

బోర్డు మార్చేశారు..

బోర్డు మార్చేశారు..

లోకసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో సికింద్రాబాద్‌లో బస్టాండ్‌లో బోర్డు మార్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పేరు స్థానంలో తెలంగాణ రాష్ట్రం వచ్చేసింది.

మరో చోట ఇలా..

మరో చోట ఇలా..

మరో చోట కూడా బోర్డును మార్చేశారు. ఆర్టీసి బస్టాండ్‌కు పేరు మార్చేసి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్థానంలో తెలంగాణ రాష్ట్రం పేరును పెట్టేశారు.

టిడిపి ఎమ్మెల్యేల రాజీనామా...

టిడిపి ఎమ్మెల్యేల రాజీనామా...

తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి తమ శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాజీనామా లేఖలతో వారు ఇలా.

మీడియాతో ఇలా...

మీడియాతో ఇలా...

రాజీనామా లేఖలు సమర్పించిన తర్వాత టిడిపి తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ ఎమ్మెల్యే..

తెలంగాణ ఎమ్మెల్యే..

పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదంపై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు నిప్పులు కక్కుతుంటే తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం ఆనందంగా ఉన్నారు. తెలంగాణకు చెందిన రావుల చంద్రశేఖర రెడ్డి ఇలా..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+