తియ్యగా మాట్లాడి దర్శకుడి ఖరీదైన ఫోన్ కొట్టేసింది

ముంబై: ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు లేఖ్ టాండన్ మొబైల్ ఫోన్‌ను ఓ మహిళ దొంగిలించింది. అతనితో తియ్యగా మాట్లాడి ఫోన్‌ను చోరీ చేసింది. ఫ్రొఫెసర్, అమ్రాపాలి, దో రహేన్, ఉత్తరయాన్ చిత్రాలకు దర్శకత్వం వహించిన నిన్నటితరం బాలీవుడ్ దర్శకుడు లేఖ్ టాండన్.

ఇతనిని మాటల్లో పెట్టి సదరు మాయాలేడీ ఫోన్ కొట్టేసింది. వివరాల్లోకి వెళ్తే.. త్వరలో తాను నిర్మించబోయే సినిమాకి దర్శకత్వం వహించాలని కోరుతూ ఓ మహిళ సీనియర్ దర్శకుడు లేఖ్ టాండన్‌కి ఫోన్ చేసింది. ఆ సినిమా గురించి చర్చించాలని చెబుతూ ఆయన వద్దకు వచ్చింది.

ఆమె టాండన్‌ను మాటల్లో పెట్టింది. తన ఫోన్ బ్యాటరీ డిశ్చార్జి అయిందని, అర్జంటుగా ఫోన్ చేసుకోవాలని, మీ ఫోన్ ఇవ్వండని చెబుతూ అతనికి చెందిన ఐఫోన్ 5 తీసుకుంది. ఫోన్ తీసుకుని మాట్లాడుతూ.. అక్కడి నుంచి పరారైంది. ఆ ఫోన్ ఖరీదు సుమారు రూ.30 వేల వరకు ఉంటుంది.

Bollywood veteran Lekh Tandon's mobile phone stolen

దీని పైన లేఖ్ టాండన్ థానే నగర పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, లేఖ్ టాండన్ వయస్సు 85. 1978లో వచ్చిన దుల్హాన్ వాహీ, జో పియా మన్ బాయే చిత్రం స్క్రీన్ ప్లేకు గాను టాండన్‌కు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది.

లేఖ్ టాండన్ పలు టీవీ సీరియళ్లను కూడా డైరెక్ట్ చేశారు. టాండన్ పొవాయ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇతనిని ఫోన్ దొంగిలించిన మహిళ 22వ తేదీన హోటల్లో కలిసింది. ఆమె వయస్సు సుమారు 30 వరకు ఉంటుందని చెప్పారు. కాగా, టాండన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె ఆమె పైన సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+