ప్రాదేశికంలో 22 ఏళ్ల బిటెక్ విద్యార్థిని రోజా హవా
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లా కడియం మండల కేంద్రం నుంచి జిల్లా ప్రాదేశిక సభ్యురాలు (జడ్‌పీటీసీ)గా బీటెక్ విద్యార్థిని పాలపర్తి రోజా విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలో నిలిచిన రోజా చిన్న వయసులోనే జడ్‌పీటీసీగా గెలిచి రికార్డు సృష్టించారు.
ప్రస్తుతం ఆమె వయసు 22 సంవత్సరాలు మాత్రమే. పైగా, తన ప్రత్యర్థి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థిని ఉల్లింకల విజయలక్ష్మిపై 14,247 ఓట్ల మెజారిటీ సాధించారు. విద్యావంతురాలిగా మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని నామినేషన్ దాఖలు చేసిన రోజు నుంచీ ఆమె చేస్తూ వచ్చారు.

దీంతో 14 గ్రామాల ప్రజలు రోజాకు జడ్పిటీసి హోదా కట్టబెట్టారు. యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదంతో తాను ఎన్నికల్లో పోటీ చేశానంటున్న రోజా తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పాలనతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని వివరించారు.
సీమాంధ్రలో మున్పిపాలిటీ ఎన్నికల్లోనే కాకుండా జడ్పిటిసి, ఎంపిటిసీ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది. దీంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నెలకొంది. వచ్చే శాసనసభ ఎన్నికల్లో కూడా ఇదే హవా సాగిస్తామనే నమ్మకంతో ఆ పార్టీ నాయకులున్నారు.












Click it and Unblock the Notifications