బెజవాడలో చంద్రబాబు అద్దె ఇంటి కష్టాలు?
హైదరాబాద్: రాష్ట్ర రాజధానిని విజయవాడుకు తరలించాలని అనుకుంటున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అద్దె ఇంటి కష్టాలు ప్రారంభమయ్యాయి. అద్దెకు ఆయనకు తగిన ఇల్లు దొరకడమే గగనంగా మారిందని అంటున్నారు. చంద్రబాబుకు అనువైన ఇంటి కోసం విజయవాడలో గత కొంత కాలంగా అన్వేషిస్తున్నారు.
చంద్రబాబు స్థాయికి తగిన ఇంటిని ఏర్పాటు చేసేందుకు అధికారులు, ఆయన సన్నిహితులు ముమ్మరంగా గాలిస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. విజయవాడ వెళ్లినప్పుడు అక్కడే ఉండి ప్రభుత్వ వ్యవహారాలను పర్యవేక్షించేందుకు క్యాంపు కార్యాలయంలా ఉండే ఇల్లును తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.

విజయవాడను ఏపీకి తాత్కాలిక రాజధానిగా ప్రకటించిన తర్వాత వివిధ శాఖల ప్రధాన కార్యాలయాలన్నీ విజయవాడ మెల్లగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వారంలో కొన్ని రోజులు హైదరాబాద్‌లో, మరికొన్ని రోజులు విజయవాడలో ఉండేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నారు.
దీంతో ఆయన ఇక్కడకు వచ్చినప్పుడల్లా నివాసం ఉండడానికి తాత్కాలికంగా ఓ పెద్ధ భవనం కోసం అధికారులు వెతుకుతున్నారు. ఇప్పటికే చంద్రబాబుకు చూపెట్టేందుకు ఓ భవనాన్ని అధికారులు సిద్ధం చేశారని సమాచారం.












Click it and Unblock the Notifications