బాబు ఉదారత: హరికృష్ణకు హిందూపురం సీటు

 Chandrababu offers Harikrishna Hindupur seat
హైదరాబాద్: రాజ్యసభకు రాజీనామా చేసిన నందమూరి హరికృష్ణ పట్ల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొంత ఉదారత ప్రదర్శిస్తున్నట్లు కనిపిస్తోంది. తిరిగి రాజ్యసభకు ఆయనను పపించడానికి చంద్రబాబు ఇష్టంగా లేరని, ఆయన స్థానంలో మరో బావమరిది నందమూరి బాలకృష్ణను రాజ్యసభకు పంపించాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హరికృష్ణ హిందూపురం నుంచి లోకసభకు పోటీ చేయాలనుకుంటే తాను పచ్చజెండా ఊపుతానని చంద్రబాబు అంటున్నారట.

అదే విధంగా, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి రానున్న సాధారణ ఎన్నికలలో వరంగల్‌ శాసనసభ నియోజకవ ర్గం నుంచి పోటీ చేయనున్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారని అంటున్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని మరో ఆరేళ్ళ పాటు పొడిగించేందుకు చంద్రబాబు విముఖతను చూపారని, అయితే అసెంబ్లీకి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే ప్రచార కార్యక్రమం నిర్వహించుకోవాల్సిందిగా చంద్రబాబు సంకేతాలు ఇచ్చినట్టు తెలుగుదేశం పార్టీ వర్గాలు తెలియజేశాయి.

కాగా రాజ్యసభ సభ్యత్వం ముగిసిన మరో టిడిపి నేత నందమూరి హరికృష్ణకు కూడా మరోసారి అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు నాయుడు విముఖతతో వున్నారని తెలిసింది. చంద్రబాబు సమన్యాయానికి విరుద్దంగా సమైక్యగళం వినిపిస్తున్న హరికృష్ణతో పార్టీ అధినేత చంద్రబాబుకు సంబంధాలు బెడిసికొట్టాయి.

అయితే రాయలసీమ లోని హిందూపురం నుంచి లోక్‌సభకు హరికృష్ణ పోటీ చేస్తే తనకు అభ్యంతరం లేదని చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించినట్టు తెలిసింది. హిందూపురంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు మంచి ఆదరణ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+