కాణిపాకం గుళ్లోకి తుపాకీతో చరణ్ రాజ్, క్షమాపణ
చిత్తూరు: వినాయక చవితి పర్వదినం నాడు కాణిపాకం ఆలయంలో సెక్యూరిటీ లోపాలు బట్టబయలు అయ్యాయి. ప్రముఖ సినీ నటుడు చరణ్ రాజ్ రివాల్వర్‌తో శుక్రవారం ఉదయం ఆలయంలోకి ప్రవేశించాడు. భద్రతా సిబ్బంది సరిగ్గా తనిఖీలు చేయకపోవడంతో రివాల్వర్‌తోనే లోపలికి వెళ్లి కాణిపాక వినాయకుడి దర్శనం చేసుకున్నాడు.
ఇదిలా ఉండగా.. కాణిపాకం ఆలయంలోకి రివాల్వర్ తీసుకురావడం పట్ల చరణ్ రాజ్ క్షమాపణలు చెప్పారు. తాను తుపాకీని ఉద్దేశపూర్వకంగా తీసుకురాలేదని వివరణ ఇచ్చారు. ఉదయం వినాయక మాల తీసే వేసే హడావుడిలో పొరపాటున గన్‌ను పక్కన పెట్టడం మరచిపోయానని చెప్పారు.

అంతేకాకుండా.. ఆలయంలోకి తుపాకీ తీసుకు వెళ్లకూడదన్న విషయం తనకు తెలియదని, ఈ విషయంలో అందరు క్షమించాలని కోరారు. భక్తులకు, ఆలయ సిబ్బందికి, పోలీసులకి ఆయన క్షమాపణులు చెప్పారు. దీంతో ఆలయ అధికారులు చరణ్ రాజ్‌కు తుపాకీని తిరిగి అప్పగించారు.












Click it and Unblock the Notifications