ప్రధాని: బిజెపికి పవన్‌కళ్యాణ్ మద్దతుపై చిరు లాజిక్
హైదరాబాద్: తన సోదరుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీకి మద్దతి ఇవ్వడంపై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ చిరంజీవికి సమాధానం చెప్పేందుకు ఓ అవకాశం వచ్చింది! శనివారం విజయవాడలో పవన్ కళ్యాణ్ బిజెపికి మద్దతు ఇచ్చే అంశంపై మరోసారి స్పందించారు.
ప్రధాననమంత్రి మన్మోహన్ సింగ్ తమ్ముడు బిజెపిలో చేరితే లేనిది... తన తమ్ముడు ఆ పార్టీతో చేయి కలిపితే ఏమిటని ఆయన అభిప్రాయపడ్డారు. ఎవరి ఇష్టాయిష్టాలను బట్టి వారు నిర్ణయం తీసుకునే హక్కు తమ కుటుంబంలో అందరికీ ఉందని చెప్పారు.

కాగా, ప్రధాని సోదరుడు రెండు రోజుల క్రితం బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ సమక్షంలో కమలతీర్థం పుచ్చుకున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించిక మోడీకి మద్దతు పలికారు. తర్వాతి ఎన్నికల కోసం పార్టీని నిర్మాణం చేస్తానని చెప్పారు. ఇప్పుడు బిజెపి, టిడిపి కూటమికి మద్దతిస్తున్నట్లు చెప్పారు.
కాగా, తన సోదరుడు బిజెపికి మద్దతివ్వడంపై చిరు పలు సందర్భాల్లో మాట్లాడుతూ... పవన్‌ది, తనది దారి వేరైనా గమ్యం ఒక్కటేనని, ప్రజలకు సేవ చేయాలనేదే తమ కుటుంబ సభ్యుల ఆలోచన అని చెప్పారు. పవన్‌క ప్రజలకు ఏదో చేయాలనే తపన బాగు ఉంటుందని చెప్పారు.












Click it and Unblock the Notifications