ముఖ్యమంత్రి విమానాన్ని చేతులేసి తోసుకొచ్చారు

చిండ్వారా (మధ్యప్రదేశ్‌): ఇంజన్ మొరాయిస్తే కార్లు, బైక్‌లు, బస్సులు, లారీలు స్టార్ట్‌ చేయ్యేసి తోయడం అనుభవంలో ఉన్నదే. అయితే, తాజాగా విమానాలకూ ఈ ఇబ్బంది తప్పనట్లు అనిపిస్తోంది. విమానానికేం ఢోకా లేదు కానీ సమస్యల్లా పార్కింగ్‌ కారణంగానే తలెత్తింది.

విషయమేంటంటే.. చిండ్వారాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ విమానంలో వచ్చారు. ఆ తర్వాత కొంతసేపటికి ఎంపీ కమల్‌నాథ్‌ ప్రత్యేక విమానంలో చిండ్వారా వస్తున్నారన్న సమాచారం మేరకు ముఖ్యమంత్రి విమానాన్ని పక్కకు జరిపారు.

Cops push Shivraj Singh's parked plan to make way for Kamal Nath to land

ముఖ్యమంత్రి తిరిగి బయలుదేరే సమయంలో విమానాన్ని రన్‌వే మీదికి చేర్చేందుకు ఆయన భద్రతా సిబ్బంది తోశారు. ఆ సంఘటన సోమవారంనాడు జరిగింది. నిజానికి, కమల్‌నాథ్ ప్రయాణిస్తున్న విమానం అంతకన్నా ముందు రావాల్సింది. కానీ జాప్యం జరిగింది. దీంతో చౌహాన్ విమానానికి పార్కింగ్ సమస్య తప్పలేదు.

చౌహాన్ విమానాన్ని పోలీసులు, ఇతర సిబ్బంది దాదాపు 15 - 20 అడుగుల దూరం తోసుకుంటూ జరిపారు. అత్యవసర ల్యాండింగ్ సమయంలో ఆ ఎయిర్ స్ట్రిప్‌ను వాడుతారు. ఈ ఎయిర్ స్ట్రిప్‌ను నాగపూర్ ఎటిసి నిర్వహిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+