దిగ్విజయ్ గర్ల్‌ఫ్రెండ్‌తో హైదరాబాదులో దిగారా?

హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల తన ప్రియురాలు అమృతా రాయ్‌తో హెదరాబాదులో దిగినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇటీవల ఆయన అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర ఫ్లోర్ లీడర్లను, మండలి నేతలను ఎంపిక చేసి వెళ్లేందుకు వచ్చారు.

అప్పుడు అమృతారాయ్‌ని వెంటేసుకుని ఆయన వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమెను హైదరాబాదులోని ఓ పెద్ద హోటల్ లో దిగబెట్టి దిగ్విజయ్ కాంగ్రెసు నేతల ఎంపికకు వచ్చారట. దిగ్విజయ్ సింగ్‌ను కలిసేందుకు ఆ పెద్ద హోటల్ కు వెళ్లిన సీమాంధ్ర నేతలు అక్కడకి వెళ్లారట. అయితే దిగ్విజయ్ పక్కనే ఓ మహిళను చూసి షాక్ తిన్నారట.

Digvijay Singh came with Amrita Roy?

ఆమె ఎవరా అనే సీమాంధ్ర నేతలు ఆరా తీస్తే అమృతారాయ్ అని తెలిసిందట. అసలే విభజన వ్యవహారంతో సీమాంధ్ర ప్రజలు తమపై గుర్రుమని చూస్తుంటే గురుడు ఏకంగా గర్ల్ ఫ్రెండును వేసుకుని ఎగేసుకుంటూ వచ్చారంటూ మండిపడ్డారట.

దిగ్విజయ్ సింగ్ వ్యవహారం చూసి తెలంగాణ నేతలు కూడా ఏమీ మాట్లాడలేకపోయారట. అసలే కాంగ్రెసు పరిస్థితి అధ్వాన్నంగా ఉంటే దిగ్విజయ్ సింగ్ హానీమూన్‌కు వచ్చినట్లు రావడమేమిటని చెవులు కొరుక్కుంటున్నారట.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+