ప్రకటనలోనూ మెలిక: బాలకృష్ణ క్లారిటీ ఇస్తారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో తమ అభిమాన హీరోకు ప్రధాన బాధ్యతలు ఇవ్వాలని నందమూరి హీరో బాలకృష్ణ అభిమానులు హంగామా చేస్తున్నారు. బాలయ్య సినిమా లెజెండ్ సినిమా ఆడియో విడుదల కార్యక్రమంలో ఆ విషయంపై బాలకృష్ణ క్లారిటీ ఇస్తారా అనే ఉత్కంఠ కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం లెజెండ్ ఆడియో విడుదల కార్యక్రమం ఉంది.
ఆడియో విడుదల కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆహ్వానించకపోవడంపై వివాదం చోటు చేసుకుంది. అయితే, ఈ విషయంపై బాలయ్య స్పష్టత ఇచ్చినట్లు గురువారం వార్తలు వచ్చాయి. ఈ కార్యక్రమానికి అభిమానులు పెద్ద యెత్తున వస్తారు కాబట్టి చంద్రబాబు వస్తే గొడవ జరగవచ్చుననే ఉద్దేశ్యంతో తాను చంద్రబాబును ఆహ్వానించలేదని బాలయ్య చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అయితే, అభిమానులు చేసే గొడవ ఏమిటి, చంద్రబాబుకు అది ఏ విధంగా ఇబ్బంది అవుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది. కాబోయే ముఖ్యమంత్రిగా బాలయ్యను ఆయన అభిమానులు చూస్తున్నారు. అదే సమయంలో పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని బాలయ్య అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
సినిమా ఆడియో కార్యక్రమంలో బాలయ్య అభిమానులు ఆ విధమైన రాజకీయ నినాదాలు చేసే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబు కచ్చితంగా ఇబ్బంది పడుతారని అంటున్నారు అంటే, అభిమానుల రాజకీయ నినాదాలను ఆహ్వానించడానికే బాలయ్య సిద్ధపడ్డారని అంటున్నారు. చంద్రబాబుతో తన సంబంధాలపై, పార్టీలో తాను నిర్వహించబోయే పాత్రపై బాలయ్య శుక్రవారం సాయంత్రం స్పష్టత ఇస్తారా అనేది ఉత్కంఠగా మారింది.












Click it and Unblock the Notifications