గులాబీ దళపతి సినిమా కెసిఆర్‌పైన?

హైదరాబాద్: ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజకీయాలను తలపించే ఓ సినిమా ముందుకు వస్తోంది. గులాబీ దళపతి పేరుతో ఏ సినిమా రూపుదిద్దుకోబోతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఇతివృత్తంగా ఈ సినిమా వస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

గతంలో తొమ్మిది వందల తొంబై తొమ్మిది రూపాయలు మాత్రమే అనే విభిన్న చిత్రానికి దర్శకత్వం వహించిన పర్స రమేష్ మహేంద్ర తెంలగాణ ఆర్ట్స్ పతాకంపై గట్టు విజయ్ (నెక్కొండ) నిర్మాణ సారథ్యంలో ఈ చిత్రాన్ని తెరకు ఎక్కిస్తున్నారు.

Gulabi Dalapathi film on KCR?

తెలంగాణ ప్రజల 60 ఏళ్ల చిరకాల స్వప్నాన్ని నిజం చేయడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, ఉద్యమమే ఊపిరిగా పోరాడిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడి ప్స్థానమే ఈ కథాంశమని వారు చెబుతున్నారు. దీన్నిబట్టి కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటం కథాంశంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందని అర్థమవుతోంది.

గులాబీ దళపతి సినిమా టీజర్‌ను దర్శకనిర్మాతలు విడుదల చేశారు. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ప్రకటిస్తామని చెప్పారు. కెసిఆర్ పాత్రను ఎవరు పోషిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+