ఆ హీరోయిన్ కోరిక: ఐఎఎస్ అవుతుందట

సివిల్స్ రాయాలనే ఉద్దేశంతో రాజకీయ శాస్త్రాన్ని ప్రధాన సబ్జెక్టుగా కూడా ఎన్నుకుందట. ఆమె ఇదివరకు 1000 అబద్ధాలు సినిమాలో నటించింది. డైరెక్టర్ తేజ ఆమెను తెలుగు తెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత వెంటనే భీమవరం బుల్లోడు సినిమాలో చాన్స్ కొట్టేసింది.
తొమ్మిదేళ్ల ప్రాయం నుంచి ఆమె వైల్ షోల్లో పాటలు పాడుతూ ఉండేదట. భరత నాట్యం, కర్థాటక సంగీతంలో శిక్షణ కూడా పొందిందట. సివిల్ సర్వీసెస్ పరీక్ష రాయడం తన కల అని చెప్పుకుంటున్న ఎస్తేర్ ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో డిగ్రీలో చేరింది. కోరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తనను సినిమాల వైపు దృష్టి మళ్లించాడని ఆమె చెబుతోంది.
కటక్, బాలీవుడ్ స్టయిల్స్‌లో ఆమెకు సరోజ్ ఖాన్ శిక్షణ ఇప్పించాడట. అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్లో చేరడానికి ఆయనే సాయం చేశాడని ఎస్తేర్ చెప్పుకొచ్చింది. 2012లో ఖయామత్ హీ ఖయామత్ సినిమాలో నటించింది. దాని డబ్బింగ్ జరుగుతున్నప్పుడు తేజ చూసి తనను 1000 అబద్ధాలు సినిమాలో నటించడానికి ఒప్పించాడని ఎస్తేర్ చెప్పుకుంటోంది. ఏమైనా ఆమె కోరిక తీరుతుందో లేదో చూడాలి.












Click it and Unblock the Notifications